మహేష్ కోనేరు మరణం..ఆ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనసు ముక్కలు

ఈరోజు టాలీవుడ్ ని ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోను చేసిన వార్త మహేష్ కోనేరు ఇక లేరు అని. అస్సలు ఊహించని విధంగా ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటినీ కూడా బాధించింది. మరి మహేష్ కి జూనియర్ ఎన్టీఆర్ లకు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల పరంగా వీరి బాండింగ్ కి ఎంతో ఉన్నత స్థానం ఉంది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఓ విషయంలో మరింత ఛిద్రం అయ్యిపోతున్నారు. అంత మంచి స్నేహితులు అయ్యినటువంటి వీరిలో మహేష్ కోనేరు ఎన్టీఆర్ చేసిన భారీ మల్టీ స్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) చూడకుండానే అలాగే దాని అనంతరం ఎన్టీఆర్ కి పాన్ ఇండియన్ లెవెల్లో వచ్చే క్రేజ్ గుర్తింపు కోసం కూడా చూడకుండా తుది శ్వాస విడిచారే అనే అంశం చాలా ఎక్కువ వారిని బాధ పెడుతుందట. దీనితో ఇది ఎన్టీఆర్ అభిమానుల మనసు ముక్కలు చేసేదిగా మారింది.