బాలయ్య నిర్మాత మీద నాన్ బెయిలబుల్ వారెంట్

Miryala Ravindar Reddy

Miryala Ravindar Reddy

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఈయన మీద తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అది కూడ చీటింగ్ కేసులో కావడం గమనార్హం. రవీందర్ రెడ్డి గతంలో నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను నిర్మించారు. సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ విషయంలోనే మతలబు జరిగింది. అమెరికాలో సెటిలైన ఒక డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి సినిమాను ఇస్తానంటూ 50 లక్షలు తీసుకున్నారట రవీందర్ రెడ్డి.

కానీ సినిమాను వేరొకరికి విక్రయించారట. సరే ఎలాగూ సినిమా ఇవ్వలేదు కాబట్టి తీసుకున్న 50 లక్షలను వెనక్కు ఇవ్వమంటే అడ్డం తిరిగారట నిర్మాత. అడగ్గా అడగ్గా కేవలం 10 లక్షలు మాత్రమే ఇస్తానని అంటున్నారట. దీంతో సదరు డిస్ట్రిబ్యూటర్ కోర్టుకు వెళ్లారు. కోర్టు రవీందర్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని పలుసార్లు ఆదేశించింది. కానీ ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి వివాదం నుండి రవీందర్ రెడ్డి ఎలా భయటపడతారో చూడాలి.