సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు, ప్రేమలు, బ్రేకప్‌లు సర్వసాధారణం. తాజాగా ఓ ప్రేమ జంట విడాకుల బంధంతో విడిపోయింది. గతేడాది ఈ ప్రేమ పక్షులు ఘనంగా వివాహాం చేసున్నాయి. సింగర్, నటుడు నోయెల్ వేయి అబద్దాలు, బండారు బుల్లోడు, జయజానకి నాయక ఫేమ్ హీరోయిన్ ఎస్తేర్ వివాహం 2019 జనవరి 4న వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ జంట ఫోటోలు అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా తాను విడాకులు తీసుకున్నానని చెబుతూ సంచలన పోస్ట్ చేశాడు నోయెల్.
‘నేను అధికారికంగా విడాకులు తీసుకున్నాను! ఎన్నో రోజుల తరువాత మౌనం వీడుతున్నాను. ఈస్తర్‌కు నాకు విడాకులు అయ్యాయి. కోర్టు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. దాని కోసమే మేము ఎదురుచూస్తున్నాము. అభిప్రాయా బేధాలు ఏర్పడటంతో విడాకులు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఓ అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడేందుకు మేము ఇలా విడిపోయాం. ఈస్తర్‌కు మంచి జరగాలి.. ఆమె కన్న కలలన్నీ నిజం కావాలి. నీకు అంతా మంచే జరగాలి..
ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయానికి మద్దతుగా ఉండాలని, ఆమెను గానీ, నా కుటుంబాన్ని గానీ ఎవ్వరూ బాధపెట్టవద్దని కోరుతున్నాను. గడ్డు కాలాన్ని ఎదుర్కున్న సమయంలో నా వెంటే నిలిచిన నా ఫ్యామిలీ, స్నేహితులకు థ్యాంక్స్. ఆ దేవుడు అన్ని సమయాలలో మంచివాడు.. ఇది గొప్ప ప్రారంభం నేను నమ్ముతున్నాను’ అంటూ నోయెల్ విడాకుల విషయాన్ని ప్రకటించాడు.