పవన్ పుణ్యమా అని ఈరోజు థియేటర్లు దద్దరిల్లుతాయి

Vakeel-Saab

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఈరోజే విడుదలకానుంది. మామూలుగా అయితే ఆన్ లైన్ ద్వారా ట్రైలర్ వదులుతారు. కానీ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ మాత్రం ఆన్ లైన్లో మాత్రమే కాకుండా థియేటర్లలో కూడ విడుదలకానుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో విడుదలకానుంది. ఫస్ట్ షో పడే ముందు ట్రైలర్ వదలనున్నారు.

మొదట థియేటర్లలో ట్రైలర్ చూడాలంటే పాసెస్ కావాలని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదని స్పష్టమైంది. ఏ థియేటర్లోకి అయినా సాయంత్రం 6 గంటలకు నేరుగా వెళ్లి ట్రైలర్ వీక్షించవచ్చు. దీంతో పవన్ అభిమానులు సాయంత్రం 6 గంటలకు అన్ని థియేటర్లను ముంచెత్తనున్నారు. పవన్ పుణ్యమా అని లాక్ డౌన్ అనంతరం థియేటర్లలో అసలు సిసలు సినిమా గోల కనిపించనుంది. ట్రైలర్ రిలీజ్ కానున్న థియేటర్ యాజమాన్యాలు సైతం భారీగా ముంచెత్తనున్న అభిమానుల్ని తట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles