అల్లు అర్జున్ కు వేరొక ఆప్షన్ లేదక్కడ

No other option for Allu Arjun

No other option for Allu Arjun

అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏమిటి అంటే ‘ఐకాన్’ అనే సమాధానం వస్తోంది. నిర్మాత దిల్ రాజు బన్నీతో ఆ సినిమా చేయడం పక్కా అని ధీమాగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సైతం ‘వకీల్ సాబ్’ సినిమాతో మంచి హిట్ కొట్టి ఊపుమీదున్నారు. కాబట్టి ముందు అనుకున్నట్టు ఆయనే ఈ సినిమాకు డైరెక్షన్ చేయనున్నారు. కానీ ఇప్పటివరకు అల్లు అర్జున్ నుండే క్లారిటీ రాలేదు. ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల క్రితమే సెట్టైన సినిమా. కానీ ఎందుకో ఆగింది. ఇప్పుడు మాత్రం చిత్రానికి ఎలాంటి అడ్డంకులూ లేవు.

క్లారిటీ రావాల్సిందల్లా బన్నీ నుండే. నిర్మాత దిల్ రాజు అంత నమ్మకంగా చెబుతున్నారు అంటే బన్నీ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే అనుకోవాలి. లేకుంటే అంత పెద్ద నిర్మాత అంత సులువుగా సినిమా బన్నీతోనే ఉంటుందని చెప్పరు కదా. ఇక బన్నీ విషయానికొస్తే ‘పుష్ప’ పూర్తవుతూనే కొత్త సినిమా స్టార్ట్ చేయాలనేది ఆయన ఆలోచన. చూస్తే స్టార్ డైరెక్టర్లు ఎవ్వరూ ఖాళీగా లేరు. కొరటాల ప్రాజెక్ట్ ఉన్నా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్ళాడు. ఎందుకంటే ‘ఆచార్య’ తర్వాత ఆయనకు ఎన్టీఆర్ సినిమా కమిట్మెంట్ ఉంది. త్రివిక్రమ్ సైతం మహేష్ బాబుతో దాదాపు కమిట్ అయినట్టే. సో.. ఇక బన్నీకి ‘ఐకాన్’ తప్ప వేరొక ఆప్షన్ లేదనే అనుకోవాలి.