Bheemla Nayak : నో డౌట్ – ముందే చెప్పొచ్చు..”భీమ్లా నాయక్” అక్కడ ప్లాప్.!

Bheemla Nayak : ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రెండు భారీ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి వీటిలో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం భారీ స్థాయి అంచనాలు నడుమ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

ఇంకా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విషయంలో చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలిసిందే. కాకపోతే ట్రైలర్ కాస్త నిరాశపరిచింది. అయినా సినిమా హిట్ అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి.

కానీ ఇపుడు అయితే అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే అక్కడ అయితే ప్లాప్ సినీ చెప్పెయ్యొచ్చు. ఈ సినిమాని తెలుగుతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామని లాస్ట్ మినిట్ లో తెలిపారు. అప్పుడు బాగానే అనిపించినా తర్వాత మాత్రం భీమ్లా పై ఎలాంటి చప్పుడు లేదు. దీనితో అసలు సినిమా చూసేందుకు ఎవరైనా వస్తారా లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

ఇంకా ట్రైలర్ లేదు సరైన పోస్టర్స్ కూడా లేవు దీనితో పవన్ కి మళ్ళీ హిందీలో భారీ ప్లాప్ తప్పేలా లేదని చెప్పాలి. అప్పుడు ఆర్జీవీ ని కూడా ఆపడం ఎవరి వల్ల కాదు. మొత్తానికి అయితే భీమ్లా నాయక్ కి అక్కడ గట్టెక్కే సూచనలే కనుచూపు మేరలో లేవు.. ఇక ఈ సినిమాలో నిత్య, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం ఇచ్చాడు.