ధనుష్ కి, దర్శకుడికి ఎలాంటి గోడవలూ లేవట

No conflicts between Dhanush and director
No conflicts between Dhanush and director
తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆయన తన 43వ సినిమాను కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో మొదలైంది.  అయితే నిన్నటి నుండి ఈ సినిమా మీద ఒక వార్త తెగ హడావిడి చేస్తోంది.  అదే దర్శకుడు కార్తీక్ నరేన్ సినిమా నుండి తప్పుకున్నాడు అని.  హీరో ధనుష్ తో తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ మూలాన కార్తీక్ నరేన్ పక్కకు వెలకిపోయారని, ఇక మీదట మిగిలిన సినిమాను సుబ్రహ్మణ్యం శివ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి.  అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తమిళ సినీ వర్గాల నుండి క్లారటీ రావడం జరిగింది. 
 
ధనుష్, దర్శకుడు కార్తీక్ నరేన్ నడుమ ఎలాంటి గోడవలూ లేవని, ఇద్దరూ షూటింగ్లో బిజీగా ఉన్నారని తెలిసింది.  దీంతో రూమర్లకు చెక్ పడింది.  ఈ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్.  ఇందులో ధనుష్ జోడీగా మాళవిక మోహనన్ కథానాయకిగా నటిస్తుండగా సముద్రఖని, మాస్టర్ ఫ్యాన్ మహేంద్రన్ కీ రోల్స్ చేస్తున్నారు.  జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేకపోతే నేరుగా థియేటర్లలో వదులుతారా అనేది తెలియాల్సి ఉంది.  ఈ సినిమా పూర్తికాగానే ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీని మొదలుపెట్టనున్నారు.  సున్నారు 100 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాకుగాను ధనుష్ 50 కోట్ల పారితోషకం పుచ్చుకుంటున్నారు.