పవన్ మేనియా.. ఇంత సీన్ ఎవ్వరూ ఊహించలేదు

No change in Pawan's craze

 

No change in Pawan's craze

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆయన ప్రజలకు కామన్ అయిపోయారు. గతంలో అంటే పవన్ ను చూడటం అనేది అరుదైన విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన్ను చూడటం చాలా ఈజీ. అలా స్టార్ స్థాయి నుండి ప్రజల్లో ఒకడైపోయిన పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంటే జనంలో ఆ క్రేజ్ ఉంటుందా లేదా, ఆయన్ను చూడటానికి జనం ఇంతకుముందులా ఎగబడతారా లేదా అనేది పెద్ద అనుమానంగా ఉండేది. కానీ నిన్నటి సీన్ చూశాక పవన్ ఛరీష్మా చెక్కు చెదరలేదని అర్థమైంది.

థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ పెట్టి టీమ్ పవన్ స్టామినాను ఒక్కసారి పరీక్షించుకున్నారు. ఆ పరీక్షలో పవన్ టాప్ చేశాడనే అనాలి. ఫ్యాన్స్ పవన్ ట్రైలర్ చూడటం కోసం థియేటర్లకు ఎగబడ్డారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రతి థియేటర్ జాతరలా మారిపోయింది. కొన్నిచోట్ల అద్దాలు విరిగాయి, తలుపులు పగిలిపోయాయి. ఉత్సాహం ఉంటుంది అనుకున్నా మునుపటిలా ఒక యుఫోరియా ఉండటం అయితే డౌట్ అనుకున్నారు. ఫ్యాన్స్ సైతం ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదు. కానీ అందిరికీ షాకిస్తూ ట్రైలర్ కే ఫస్ట్ డే ఫస్ట్ షో చూపించేశాడు పవన్. అది చూశాక పవన్ క్రేజ్ చెక్కుచెదరలేదని రుజువైంది.