Chiru’s Political Re-Entry : చిరంజీవి మాటల్ని ఎంతవరకు విశ్వసించగలం.?

Chiru’s Political Re-Entry : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి చాలాకాలమే అయ్యింది. అయినాగానీ, ఆయన్ని కొందరు బలవంతంగా రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో ‘మార్పు’ తీసుకురాలేక, తానే మారిపోయారు చిరంజీవి. అప్పటి ప్రజారాజ్యం పార్టీ కథ, వ్యధ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సరే, చిరంజీవి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో మనుగడ సాధించలేరన్నది ఓపెన్ సీక్రెట్.. అది వేరే వ్యవహారం. ఇంతకీ, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా.? రారా.? ఈ విషయమై చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే అవకాశమే లేదన్నారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని కూడా సూచించారు. మీడియాకీ సుతిమెత్తగా క్లాసులు తీసుకున్నారు.

అయినాగానీ, చిరంజీవి రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న గాసిప్స్ మాత్రం ఆగడంలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అసలు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని 2009కి ముందు ఎవరూ అనుకోలేదు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడతారని కూడా ఎవరూ 2014 ఎన్నికలకి ముందు అంచనా వేయలేకపోయారు.

పొలిటికల్ రీ-ఎంట్రీపై చిరంజీవి ‘నో’ చెప్పేసినా, పరిస్థితులు ఆయన్ని మళ్ళీ రాజకీయాల్లోకి లాగేంతలా మారిపోవచ్చు. నిజానికి, చిరంజీవి అలా రాజకీయాల్లోకి రావడానికి కూడా చాలా పరిస్థితులు సృష్టించబడ్డాయి కొందరి ద్వారా. అలా చిరంజీవిని బదనాం చేసేందుకు చాలామంది ప్రయత్నించారు.
ఇప్పటికీ చిరంజీవి మీద రాజకీయంగా బురద చల్లుతూనే వున్నారు ఆ కొందరు. సో, బీజేపీ తరఫునో.. జనసేన తరఫునో చిరంజీవి ముందు ముందు వకాల్తా పుచ్చుకోవచ్చు, రాజకీయాల్లోకి రావొచ్చు.