Nivetha Thomas : పవన్ కళ్యాణ్ సినిమాలో నివేదా థామస్.!

 Nivetha Thomas : ‘భవదీయుడు భగత్‌సింగ్’ టైటిల్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. లక్కీ ఛామ్ పూజా హెగ్దే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జత కడుతోంది.

కాగా, ఈ సినిమాకి సంబంధించి మరో అప్టేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఆమె ఎవరో కాదు, నివేదా థామస్. నివేదా మంచి నటి. ఎలాంటి హావభావాలైనా ఈజీగా నేచురల్‌గా పలికించేయగలదు.
‘వకీల్ సాబ్’ సినిమాలో పల్లవి పాత్ర నివేదా థామస్‌‌లోని నటిని మరో కోణంలో చూపించింది. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో మరో ఛాన్స్ అందుకుంది. ‘భవదీయుడు భగత్‌సింగ్’ లో నివేదా పాత్ర ఎలా వుండబోతోందంటే, పాత్ర పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అట.
నిడివి తక్కువే అయినా, కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రని తెలుస్తోంది. గ్లామర్ సంగతి పక్కన పెడితే, మొదటి నుంచీ నివేదా థామస్ యాక్టింగ్‌కి స్కోపున్న క్యారెక్టర్లనే ఎంచుకుంటూ వస్తోంది. ఆమెను అలాంటి పాత్రలే వెతుక్కుంటూ వస్తున్నాయ్ కూడా.
హరీష్ శంకర్ సినిమా అంటే కమర్షియల్ టచ్ ఖచ్చితంగా వుంటుంది. సో, ఇలాంటి కమర్షియల్ మూవీస్‌లో ఛాన్సు దక్కించుకోవడం నివేదా థామస్ కెరీర్‌కి అదో ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు.