Nithin Comes First : షాకింగ్ అప్డేట్: పవన్ వెనక్కి.. నితిన్ ముందుకి.!

Nithin Comes First

Nithin Comes First : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. అయితే, ఆ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లేలా కనిపిస్తోందట. ప్రస్తుతం పవన్ వేరే ప్రాజెక్టులతో బిజీగా వుండడం వల్ల సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌కి కాస్త గ్యాప్ దొరికేలా కనిపిస్తోంది.

ఆ గ్యాప్‌లో నితిన్ కోసం సురేందర్ రెడ్డి ఓ స్టోరీ లైన్ సిద్ధం చేసినట్లు తాజాగా ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాతో బిజీగా వున్నాడు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో వున్నాడు. అఖిల్ హీరోగా తెరకెక్కుతోంది ఈ యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్టైనర్. కాగా, సురేందర్ రెడ్డి, నితిన్ కోసం సిద్ధం చేసిన స్టోరీ డెవలప్‌మెంట్స్ విషయమై గ్రౌండ్ లెవల్లో వేగంగా వర్క్ నడుస్తోందనే సంకేతాలు అందుతున్నాయ్.

‘ఏజెంట్’ పూర్తి కాగానే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేయాలనుకుంటున్నాడట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మండన్నా కానీ, పూజా హెగ్దే కానీ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయట.

అలాగే ఓ బాలీవుడ్ భామ పేరు కూడా పరిశీలనలో వుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు పూర్తిగా వెల్లడి కానున్నాయ్. ప్రస్తుతం నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.