Nithin : క్రేజీ అప్డేట్ : తన ఫస్ట్ లుక్ తో అందరికీ ప్రామిస్ ఇచ్చిన నితిన్..ఏమిటంటే?

Nithin :  టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచి క్రేజ్ ఉన్న నితిన్ రెడ్డి కూడా ఒకడు. అయితే నితిన్ హీరోగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసినా వాటిలో ఓ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ వచ్చి మాత్రం చాలా కాలం అయ్యింది. లవ్ స్టోరీ లు ఫ్యామిలీ డ్రామా లు తీస్తూ వస్తున్న నితిన్ దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తో అనౌన్స్ చేసిన సినిమానే “మాచర్ల నియోజకవర్గం”.
ఇది అనౌన్స్ చేసి ప్రీ లుక్ పోస్టర్స్ విడుదల చెయ్యడంతో మంచి క్రేజ్ నెలకొంది. దీనితో అక్కడ నుంచి ఏ అప్డేట్ వచ్చినా అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇది మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా మరియు ఇంటెన్స్ గా ఉందని చెప్పాలి.
పూర్తిగా మాస్ అవతార్ లోకి మారిపోయిన నితిన్ ఓ గట్టి ఫైట్ సీన్ లో అలా స్టైలిష్ గా కూర్చున్న లుక్ ని చిత్ర యూనిట్ వదిలారు. అలాగే ఈ పోస్టర్ చూస్తే ఇది ఒక పండుగ ఫైట్ అన్నట్టు కూడా అర్ధం అవుతుంది. మరి వీటిని మించి అయితే నితిన్ ఒక ప్రామిస్ చేసాడు.
మీకు నచ్చే మీరు నచ్చే మాస్ తో వస్తున్నా సిద్ధంగా ఉండండి అన్నట్టు తెలిపాడు. మరి ఈ ప్రామిస్ ని తాను ఎంతవరకు నిలబెడతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి మరియు క్యాథరిన్ ట్రెసా లు హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
https://twitter.com/actor_nithiin/status/1507577212467245056?s=20&t=66_w8_5-OA1t72FVz9Ho3A