హైదరాబాద్ నగరంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. సరైన కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే వారిని పోలీసులు ఉపేక్షించట్లేదు. నగరంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే నిబంధనలు అమలుచేస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ పనుల మీద తప్పనిసరి పరిస్థితుల్లో బయటకివచ్చేవారికి ఈ నిబంధనలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. చాలామంది ఇప్పటికే పోలీలుసుల చేతుల్లో దెబ్బలు తిన్నారు కూడ. వారంటే సామాన్యులు కాబట్టి పెద్దగా హైలెట్ కాలేదు కానీ హీరో ఇదే తరహా ఇబ్బంది ఎరుర్కోవడంతో ఇష్యూ పెద్దది అయింది.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పలుచోట్ల బాధితులకు బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు లాంటివి అందిస్తూ తనవంతు సహాయం చేస్తున్నారు. నిన్న అత్యవసరంలో ఉన్న వ్యక్తి కోసం ముందులు తీసుకుని ఉప్పల్ నుండి వెళ్తున్న నిఖిల్ కారును పోలీసులు ఆపడం జరిగింది. పేషంట్ వివరాలు, ప్రెస్క్రిప్షన్ చూపించినా పోలీసులు వినలేదట. పాస్ కావాల్సిందే అన్నారట. దీంతో నిఖిల్ పాస్ కోసం 9సార్లు ట్రై చేసినా సర్వర్ డౌన్ కావడంతో పాస్ దొరకలేదు. అయినా వైద్యం అత్యవసరమైన వ్యక్తి కోసం కాబట్టి అనుమతిస్తారని బయటికొచ్చాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు అందరూ ఇలాంటి టైంలో కూడ అనుమతించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు.