సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న నిహారిక హాట్ ఫొటో.. ఫిదా అవుతున్న నెటిజన్స్

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల త‌న‌య నిహారిక గ‌త ఏడాది న‌వంబ‌ర్ నుండి దాదాపు ప్ర‌తి రోజు వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. డిసెంబ‌ర్ 9న నిహారిక వివాహం చైత‌న్య‌తో ఉద‌య్‌పూర్ ప్యాలెస్ వేదిక‌గా జ‌ర‌గ‌గా, దీనికి ముందు ప‌సుపు వేడుక‌, మెహందీ , సంగీత్ వంటి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా జ‌రిగాయి. పెళ్లికి మెగా ఫ్యామిలీ హీరోలు అంతా హాజ‌రు కావ‌డంతో ఆ వేడుక చూడ ముచ్చ‌ట‌గా క‌నిపించింది. ఇక పెళ్లి త‌ర్వాత హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ జ‌రుపుకుంది ఈ జంట. డిసెంబర్ 18న నిహారిక బ‌ర్త్ డే వేడుక కాగా, ఈ వేడుక‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ప‌లు టీవీ ఆర్టిస్టుల‌తో పాటు నిహారిక కుటుంబ స‌భ్యులు కూడా బ‌ర్త్‌డే వేడుక‌లో పాల్గొన్నారు.

పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న నిహారిక మాల్దీవుల‌లో త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్స్‌కు చేర్చింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేశాయి. ఇక ఇటీవ‌ల అర్ధ‌రాత్రి త‌న భ‌ర్త‌తో క‌లిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళ‌గా అందుకు సంబంధించిన వీడియో కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే మొన్న‌టి వ‌ర‌కు చాలా ప‌ద్ద‌తిగా ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేసిన నిహారిక ఇటీవ‌ల త‌న ట్రాక్‌ని మార్చిన‌ట్టు క‌నిపిస్తుంది.

పెళ్ళి త‌ర్వాత నిహారిక ఎక్కువ‌గా ట్రెండీ దుస్తుల‌లో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. పొట్టి నిక్క‌ర్లు, షార్ట్ డ్రెస్సెస్ వేస్తూ యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లూ జీన్స్ టాప్‌ ధరించి హాట్‌గా పోజివ్వడమే గాక.. ఈ సమయంలో ఈ ప్లేస్ అని ట్యాగ్ చేసింది నిహారిక. దీనిపై నెటిజ‌న్స్ నుండి మిక్స్‌డ్ స్పందన ల‌భిస్తుంది. కొంద‌రేమో చాలా సెక్సీగా క‌నిపిస్తున్నావు అని అంటుంటే మ‌రి కొంద‌రేమో పెళ్లి త‌ర్వాత ఈ ఎక్స్‌పోజింగ్‌లు ఏంట‌ని కామెంట్స్ పెడుతున్నారు.