సెలెబ్రేషన్స్ ప్రారంభం … పెళ్లి కూతురిగా ముస్తాబైన నిహారిక !

మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌ కు చేరుకొని సందడి చేస్తున్నారు. . కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిధులు హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లి కూతురిని చేసే కార్యక్రమంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. నిహారిక పెళ్లి కూతురుగా ముస్తాబు అయిన కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ఆ ఫొటోల్లో నిహారిక .. పట్టుచీర లో పెళ్లి కూతురి గెటప్ లో క్యూట్ క్యూట్ గా కనిపిస్తుంది.

ఇక ,ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ కి చేరుకోగా మెగాస్టార్ రేపు ఆచార్య షూటింగ్ తర్వాత డైరెక్ట్ ‌గా ఉదయపూర్ వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆదివారం లేకపోతే.. సోమవారం ఉదయం ఉదయ్‌ పూర్ వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే పెళ్లి లో బిజీగా కుటుంబం తో కలిసి ఉండనున్నాడు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా తమ షూటింగ్‌లో తీరిక చేసుకొని సోమవారం ఉదయం పెళ్లి జరిగే ఉదయ్ పూర్‌‌కుతమ కుటుంబ సభ్యలతో కలిసి చేరుకోనున్నారు.

అలాగే మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులకి ఆహ్వానాలని పంపింది. ఇకపోతే ఈ పెళ్లి కోసం నాగబాబు , కాబోయే అల్లుడికి బాగానే ముట్టజెప్పినట్టు సమాచారం. డైరెక్ట్‌గా పెళ్లి కొడుకుకు కాకుండా.. నిహారికకు దాదాపు రూ. 10 కోట్ల వరకు లాంఛనం ఇవ్వబోతున్నట్టు సమాచారం