అభిమానుల‌ని చిన్న కోరిక కోరిన నిధి అగ‌ర్వాల్‌.. !

స‌వ్య‌సాచి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్‌. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ తో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన నిధి అగ‌ర్వాల్ త‌న ఫొటో షూట్స్‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. ముఖ్యంగా హాట్ హాట్ అందాల‌తో యూత్‌ను క‌వ్విస్తూ వారి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తుంది. అలానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పీరియాడిక‌ల్ మూవీ చేస్తుంది. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చింది నిధి.

నిధి అగ‌ర్వాల్‌కు తెలుగులోనే కాక త‌మిళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల భూమి, ఈశ్వ‌ర‌న్ అనే చిత్రాల‌తో త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిధి త‌న న‌ట‌న‌తో త‌మిళ తంబీల మ‌న‌సులు గెలుచుకుంది. ఇప్పుడు అక్క‌డ నిధికు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. నిధిపై ఉన్న అమిత‌మైన ప్రేమ‌తో ప్ర‌త్యేకంగా గుడి క‌ట్టి పూజ‌లు చేశారు. కేక్ క‌టింగ్‌లు చేసి సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు. వేలంటైన్స్ డే రోజు జ‌రిగిన ఈ హంగామా గురించి తెలుసుకున్న నిధి అగ‌ర్వాల్ చాలా సంతోషం వ్య‌క్తం చేసింది.

తాజాగా గుడి క‌ట్టిన అభిమానుల‌కు నిధి అగ‌ర్వాల్ ఓ చిన్న రిక్వెస్ట్ పెట్టింది. గుడిని అనాధ‌ల‌కు ఆశ్ర‌యంగా ఇవ్వ‌మ‌ని కోరింది. అలానే అందులో పేద‌ల ఆక‌లి తీర్చ‌డం, విద్య‌ను అందించ‌డం వంటి సేవా కార్యక్ర‌మాల‌ను చేయాల‌ని ట్ర‌స్టీల‌ను కోరింది. త‌న‌కు ఇంత మంచి అభిమానులు ఉన్నందుకు గ‌ర్వంతో ఉప్పొంగిపోతున్నానంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. మ‌రి నిధి కోరికను అభిమానులు తీరుస్తారా లేదా అన్న‌ది చూడాలి. అయితే అతి త‌క్కువ స‌మ‌యంలోనే నిధి అగ‌ర్వాల్ ఈ రేంజ్ క్రేజ్ అందుకోవ‌డం గొప్ప విశేష‌మే మ‌రి.