పవన్ తో వయసు తేడాపై హాట్ బ్యూటీ కీ కామెంట్స్!

Nidhhi Agerwal Clarity On Age Difference With Pawan Kalyan | Telugu Rajyam

టాలీవుడ్ ప్రెజెంట్ జెనరేషన్ యూత్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కి ఉన్న క్రేజ్ నే వేరు.. ఇస్మార్ట్ శంకర్ తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు భారీ ఆఫర్స్ తో దూసుకెళ్తుంది. మరి ఈ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’ అని ఓ పెద్ద ప్రాజెక్ట్ ని కూడా చేస్తుంది. ఈ చిత్రంలో పంచమి అనే ఇంట్రెస్టింగ్ పాత్ర తాను చేస్తుంది.

ఇక ఇదిలా ఉండగా మన టాలీవుడ్ ట్రెండ్ కోసం తెలిసిందేగా దాదాపు వయసుతో సంబంధం లేకుండానే హీరో హీరోయిన్స్ జంట ఉంటుంది. ఇప్పుడు వీరమల్లు లో కూడా పవన్ నిధి ల జంట అలాంటిదే.. అయితే ఈ వయసు తేడాపైనే నిధి అగర్వాల్ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ తో చక్కటి క్లారిటీ ఇచ్చింది.

పవన్ కి తనకు సగం వయసు తేడా ఉన్నా పవన్ మనసులో మాత్రం చాలా యంగ్ గా ఉంటారని అందుకే తనకి పవన్ తో సినిమా చేస్తున్నంతసేపు ఎక్కడా కూడా వయసు గుర్తు రాలేదని తెలిపింది. అలాగే సినిమాలో తమ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది అని ప్రతి ఒక్కరికీ స్క్రీన్ పై నచ్చుతుంది అని ఆమె తెలిపింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles