Road Accident: కొత్త సంవత్సరానికి ఎంతోమంది కోటి ఆశలతో స్వాగతం పలకగా మరికొంతమంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో జనవరి ఒకటవ తేదీ వివిధ రోడ్ యాక్సిడెంట్ కారణంగా దాదాపు పది మందికి పైగా మృతి చెందారు. ఈక్రమంలోనే పెళ్లైన వారానికే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
వికారాబాద్ పోలీస్ ఎస్సై శ్రీను నాయక్, డిసెంబర్ 26వ తేదీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అత్తారింటి నుంచి ఒడిబియ్యం తీసుకువెళ్లడానికి ఆటోలో కలిసి తన తండ్రితో వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఎస్ఐ శ్రీను నాయక్ తన తండ్రి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలియజేశారు. అయితే ఎస్ఐ శ్రీను నాయక్ తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. తన చేతికి గాయం కావడంతో శ్రీను నాయక్ స్వయంగా ఆటో నడిపారు.
ఎస్సై శ్రీను నాయక్ కి వారం కిందట వివాహం జరగడంతో వారి ఆచారం ప్రకారం అత్తారింటి నుంచి ఒడిబియ్యం తీసుకు వెళ్ళడం కోసం వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన వారానికి తన భర్త చనిపోవడంతో ఆ నవవధువు బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఇక ఎస్ ఐ శ్రీను మరణించడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.