ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ.. !

ap police

 

ఏపీ ప్రభుత్వం ప్రజల కోసమే కాదు. అక్కడి పోలీసుల కోసం కూడా ఆలోచిస్తుందని నిరూపించబడింది.. విరామం లేకుండా విధులు నిర్వహించే ఏపీ పోలీసుల విషయంలో అధికార ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ అమలు చేస్తుంది.. దీని వల్ల వారమంతా కేసుల చుట్టూ తిరుగుతున్న వారు ఆ ఒక్క రోజైనా కుటుంబంతో గడిపే అవకాశం దొరికినట్లయ్యింది..

ఇక రేపటి నుంచి 10 రోజుల పాటూ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాలు కూడా జరపనున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. అదేమంటే ఇప్పటి వరకు ఎవరైన పోలీసు సహజ‌ మరణం పొందితే వారికి వర్తించే బీమా మొత్తం రూ.1.5 లక్షలుగా ఉండే ఆ సొమ్మునూ రూ.3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు..

ఇందులో భాగంగా జీవన్ జ్యోతీ బీమా, సురక్ష బీమా ఎంవోయూపై డీజీపీ సవాంగ్ సంతకం చేశారు. కాగా బుధవారం నుంచి ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఈ పాలసీలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు.. ఇవే కాకుండా పోలీసుల కోసం ప్రత్యేక పాలసీలు ఇస్తున్నామని ఎస్బీఐ ఏజీఎం తెలియచేస్తూ, రూ.40లక్షల వరకూ యాక్సిడెంటల్ పాలసీ, రూ.3లక్షల వరకూ సహజ మరణం పాలసీలతో పాటుగా సుకన్య సమృద్ధి యోజన కూడా ఉందని దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు..

ఇక ఇప్పటికే ఏపీలో మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారన్న విషయం తెలిసిందే.. అంతే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఇకపోతే ఈ భీమా పక్రియను మంగళవారం లాంఛనంగా ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్ళు డి.రజని, దుర్గా ప్రసాద్‌కి ఈ పాలసీలను అందించారు..