వర్మ.. ఈ పైశాచిక ఆనందం ఇంకెన్నాళ్లు పొందుతావ్

Netizens fires on Ram Gopal Varma

Netizens fires on Ram Gopal Varma

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాల మీద దృష్టి పెట్టడం మానేసి చాలాకాలమే అయింది. ఒట్టి స్క్రాప్ సినిమాలే తీస్తూ హడావుడి చేయడం తప్ప ఇంకో పని చెయ్యట్లేదు. దీంతో ప్రేక్షకులు కూడ ఆయన్ను లైట్ తీసుకున్నారు. వర్మ సినిమా అంటే అదొక రొట్ట అనే మార్క్ ఏనాడో పడిపోయింది. అలా ఇండస్ట్రీలో [పాతాళ స్థాయికి జారిపోయిన వర్మ ఎలాగోలా జనాలకు గుర్తుండాలని సోషల్ మీడియాలో తన పైత్యాన్ని చూపిస్తున్నారు. హీరోలను టార్గెట్ చేసుకుని తరచూ ఏదో ఒక వివాదం రేపుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరును పట్టుకుని వేలాడుతూ ఉనికి కోసం నానా తిప్పలూ పడుతున్నారు.

తాజాగా పవన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన పవన్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. అంతే.. వెకిలి చేష్టలు స్టార్ట్ చేసేశాడు వర్మ. ‘ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? చెప్పండి యువర్ ఆనర్’ అంటూ అతి తెలివి ట్వీట్ ఒకటి వేశాడు.

అంతటితో ఆగకుండా ‘వేరే హీరో ఫ్యాన్స్ అంతా పవన్ పరిస్థితికి కరోనా కారణం కాదు. వకీల్ సాబ్ వసూళ్లే కారణమని అంటున్నారు. రండి, కదలండి, ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపండి’ అంటూ హీరోల అభిమానుల మధ్యన చిచ్చు పెట్టే పైశాచిక చర్యకు పూనుకున్నాడు. ‘ఈ ఫోటోలో ఒక తప్పుంది. కనిపెట్టండి. బహుమతి ఇస్తాను. ఫేక్ అని నేనట్లేదు. వేరే హీరోల దగుల్భాజీ ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్ల ఆట కట్టించడానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా ఆ ఛాలెంజ్ విసిరా’ అంటూ వెర్రి మొత్తాన్ని ప్రదర్శించాడు. వర్మ నైజం తెలిసిన నెటిజన్లు ఇంకెన్నాళ్లు ఈ పైశాచిక ఆనందం పొందుతావ్ వర్మ అంటూ చీవాట్లు పెడుతున్నారు.