నెటిజన్స్ మీద మండిపడుతున్న సమంత…ఆమె ప్రవర్తనలో మార్పుకు కారణం ఏంటి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. నాగచైతన్య సరసన నటించిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత ఆ సినిమా హిట్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో సమంత నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళంలో కూడా సమంత ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక హిందీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలలో తన జోరు మరింత పెంచింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో సెక్సీగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత గ్లామర్ డోసు మరింత పెంచింది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం సమంత నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత నెటిజన్స్ పలుమార్లు విమర్శిస్తూ చైతన్యని మోసం చేసావు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇదివరకు ఇలాంటి ట్రోలింగ్స్ ని చూసి చూడనట్టు వదిలేసే సమంత ఇప్పుడు మాత్రం నెటిజెన్స్ మీద ఫుల్ ఫైర్ అవుతోంది. నెటిజన్స్ తనకు వ్యతిరేకంగా చేసే కామెంట్స్ మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ చాలా ఘాటుగా సమాధానాలు చెబుతోంది. ఇటీవల కూడా వీరి విడాకుల గురించి అడిగిన ప్రశ్నకు సమంత చాలా సీరియస్ గా రిప్లై ఇచ్చింది. అయితే సమంత ఈ మధ్య కాలంలో మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ ఫైర్ అవుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల సమంత ఇలా వరుసగా హాట్ ఫోటోలు షేర్‌ చేయడంతో పాటు నెటిజన్స్ మీద ఫైర్ అవుతుండటంతో సమంత ప్రవర్తనలో ఈ మార్పుకు కారణమేంటి అంటూ అందరికీ అనుమానం మొదలయ్యింది.