Home News స‌మంత‌కు చుక్క‌లు చూపించిన నెటిజ‌న్స్.. దెబ్బ‌కు పోస్ట్ డిలీట్!

స‌మంత‌కు చుక్క‌లు చూపించిన నెటిజ‌న్స్.. దెబ్బ‌కు పోస్ట్ డిలీట్!

అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం తీరిక‌లేనంత బిజీగా మారింది. మొన్న‌టి వ‌ర‌కు సామ్ జామ్ షోతో బిజీగా ఉన్న స‌మంత ఇప్పుడు ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటుంది. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ మీడియాలోకి అడుగుపెట్టిన సామ్ ఇందులో నెగెటివ్ రోల్ పోషించింది. ఈ పాత్ర స‌మంతకు మంచి పేరు తెస్తుంద‌ని అంటున్నారు. అయితే ఈ అమ్మ‌డు ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల కోసం ముంబైలో ఉండ‌గా, త‌న స్టైలిస్ట్ ప్రీత‌మ్‌తో క‌లిసి ఫొటోలు దిగింది. ఓ ఫొటోలో ప్రీతమ్ జుకల్కర్ ఒళ్ళ్లో కాళ్లు పెట్టి సోఫాపై ప‌డుకుంది. ఆ ఫొటోకు నాలుగేళ్ల బంధం మాది అనే కామెంట్ కూడా పెట్టింది.

Sam 4 | Telugu Rajyam

స‌మంత పోస్ట్‌కు వెంట‌నే స్పందించిన ప్రీతమ్ జుకల్కర్ ఐ ల‌వ్ యూ అనే కామెంట్ పెట్టాడు. దీంతో నెటిజ‌న్స్‌కు చిర్రెత్తింది. పెళ్ళైన నువ్వు వేరే వ్య‌క్తితో ఇంత స‌న్నిహితంగా ఉండ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ కామెంట్ పెట్టారు. కొంద‌రైతే స‌మంత‌ని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక చేసేదేం లేక పోస్ట్‌ని ఇన్స్టాగ్రామ్ నుండి తొలిగించింది. గ‌తంలోను స‌మంత‌కు నెటిజ‌న్స్ నుండి ఇలాంటి స‌మస్య‌లు రాగా, ప‌లు పోస్ట్‌లు డిలీట్ చేసిన విష‌యం తెలిసిందే.

గ‌త ఏడాది ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌మంత తాజాగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న శాకుంత‌లం సినిమాకు సైన్ చేసింది. ఇందులో శకుంత‌ల‌గా స‌మంత న‌టించ‌నుండ‌గా, ఆమె ఆ పాత్ర‌లో ఎలా ఉంటుందో అని అభిమానులు ఊహాలోచ‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం సామ్ జామ్ అనే షోని హోస్ట్ చేస్తుంది. ఈ షో తొలి పార్ట్‌లో ఏడుగురు సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేసి వారిద‌గ్గ‌ర నుండి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను రాబ‌ట్టింది. మ‌రోవైపు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేయ‌నుంది. ఇందులో చైతూతో క‌లిసి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

- Advertisement -

Related Posts

శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని వెనక ఉన్న హీరోయిన్ తనే ..!

శ్యామ్ సింగరాయ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం. రీసెంట్ గా నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర...

త‌ర్వాతి సినిమాలో రెట్రో లుక్‌తో క‌నిపించనున్న ఉస్తాద్ హీరో..!

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పంథా మార్చాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌ల‌తో అల‌రించిన రామ్ ఇప్పుడు మాస్ మ‌సాలా లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్...

పునర్నవి అందాల విందు.. పిక్స్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే సోషల్ మీడియాలో పది మందికి పనికి వచ్చే విషయాలను పంచుకుంటూ ఉంటుంది. వ్యాయామం, సౌందర్య చిట్కాలు,...

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన…ఆ ఆరుగురు వీరే !

ఏపీ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా...

Latest News