Pawan Kalyan: ‎బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సినిమాలో అలాంటి ఛాన్స్.. ఎవరో తెలుసా?

Pawan Kalyan: ‎మాములుగా హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అన్నది చాలా కష్టం. ఒకవేళ నిలదొక్కుకోవాలి అంటే అందంతో పాటుగా ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినప్పుడు వరుస సినిమాలలో నటించి మెప్పించిన వారు చాలా మందే ఉన్నారు. అలా హీరోయిన్స్ గా రాణించి ఆ తర్వాత సైలెంట్ అయిన ముద్దుగుమ్మలు మన దగ్గర చాలా మందే ఉన్నారు. హీరోయిన్స్ గా మెప్పించి ఆ తర్వాత అవకాశాలు తగ్గి స్పెషల్ సాంగ్ లో మెరుస్తున్న భామలు చాలా మందే ఉన్నారు.

‎అదేవిధంగా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. అలా ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టనుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? సినిమా ఏది? అన్న వివరాల్లోకి వెళితే.. ఆ హీరోయిన్ మరెవరో కాదు ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా డీజే టిల్లు. ఈ మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

‎మెహబూబా సినిమాతో పరిచయమైన నేహా డిజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడి పేరు మారుమ్రోగింది. కానీ ఈమె అనుకున్న రేంజ్ లో మాత్రం అవకాషాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా క్రేజ్ రాలేదు. దాంతో మెల్లగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నేహాకు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎంతవరకు కలిసిస్తుందో చూడాలి మరి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని ప్లాప్ గా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి టైమ్ లో ఆమెకు ఈ అవకాశం ఏ మేరకు గుర్తింపును తెచ్చిపెడుతుందో చూడాలి మరి.