మణిశర్మ మెలోడీ: ‘నీలాంబరి’కి ఫిదా అవ్వాల్సిందే.!

మణిశర్మ మ్యూజిక్ అంటే ఓ వ్యసనం. ఆయన మెలోడీకి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి మణిశర్మ మ్యూజిక్‌లో వచ్చిన ‘నీలాంబరి’ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ఆచార్య’ సినిమాలోని ‘నీలాంబరీ నీలాంబరీ.. వేరెవ్వరే నీలా మరి..’ అంటూ సాగే సాంగ్ వీనుల విందుగా సాగుతోంది.

ఇక ఈ సాంగ్‌లోని విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. విజువల్స్‌కి తగ్గట్టుగా నీలాంబరిగా పూజా హెగ్దే అందాలూ, రామ్ చరణ్, పూజా హెగ్దే అందమైన జంట అన్నీ పాటకు బాగా సెట్ అయ్యాయి. ఎక్కడా చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ వచ్చిన ఈ సినిమాలోని అప్‌డేట్స్ అన్నీ ఓ ఎత్తు. లేటెస్ట్ ‘నీలాంబరి’ సాంగ్ ఇంకో ఎత్తు అనేలా ఉంది. ‘ఆచార్య’ పై ఉన్న అంచనాల్ని అమాంతం ఆకాశానికెత్తేసిందీ ‘నీలాంబరి..’ సాంగ్.

‘రంగస్థలం’లో ‘జిగేల్ రాణి’గా మాస్ స్టెప్పులేసిన పూజా హెగ్దే, ‘ఆచార్య’ కోసం ‘నీలాంబరి’గా లంగా వోణీల్లో ఎంత క్యూట్ క్యూట్‌గా ఆకట్టుకుంటోందో. చూసే కొద్దీ చూడబుద్దేసేలా ఉందీ నీలాంబరి.