Fahad Fasil: పుష్ప నటుడు ఫహద్ భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారా… ఎమోషనల్ పోస్ట్ చేసిన నజ్రియా!

Fahad Fasil: ఫహద్  ఫాసిల్ పరిచయం అవసరం లేని పేరు మలయాళ నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన తెలుగులో పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షేఖావత్  పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో కూడా మరింత క్రేజ్ పెరిగిపోయింది ఇక నటుడు మరో నటి నజ్రియను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎంతో అనన్యంగా ఉన్న ఈ దంపతులు మధ్య గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది అంతేకాకుండా మరి కొంతమంది వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి సందేహాలు రావడానికి కారణం లేకపోలేదు. తాజాగా నటి నజ్రియా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పలు సందేహాలకు కారణం అవుతుంది. ఈ సందర్భంగా స్పందిస్తూ…

నజ్రియా నాలుగు నెలలకు పైగా కనిపించకపోవడంపై ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణ చెబుతూ ఒక పోస్ట్ చేశారు..
గత కొన్ని నెలలుగా నేను మానసికంగా బాగాలేను. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నాను. నా 30వ పుట్టినరోజు, కొత్త సంవత్సరం, ‘కొత్త సినిమా’ విజయాన్ని మీతో పంచుకోలేకపోయాను. నేను సోషల్ మీడియాలో ఎందుకు లేను, కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో స్నేహితులకు వివరించలేదు.

నన్ను కలవడానికి ప్రయత్నించిన నా స్నేహితులందరికీ కూడా ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నాను.ఇది కఠినమైన ప్రయాణం. ప్రతిరోజూ నేను మెరుగవుతున్నాను. పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. కానీ నేను తిరిగి వస్తానని  హామీ ఇస్తున్నాను ఇలా చేసినందుకు కుటుంబం, స్నేహితులు, అభిమానులకు వివరణ ఇవ్వాలనుకున్నాను. అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ నజ్రియా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే ఈ పోస్టులో ఎక్కడ కూడా తన భర్త గురించి ఈమె ప్రస్తావన చేయలేదు.

ఇలా తన భర్త గురించి చెప్పకపోవడంతో వీరిద్దరి మధ్య ఏమైనా బేదాభిప్రాయాలు వచ్చాయా… వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలకు చెక్ పడాలి అంటే వీరిద్దరూ స్పందించాల్సి ఉంది.