నయనతార పెళ్లి టీజర్ వచ్చేసిందోచ్…!

నయనతార విగ్నేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే వీరి ప్రేమ జీవితానికి స్వస్తి పలుకుతూ పెళ్లి బంధంతో వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇలా పెళ్లి తర్వాత ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగిన ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు.ఇక వీరి హనీమూన్ ముగించుకొని తిరిగి ప్రస్తుతం ఎవరి సినిమా పనులలో వారు బిజీగా ఉన్నారు. ఇకపోతే నయనతార విగ్నేష్ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు 25 కోట్ల రూపాయల ఖర్చు చేసి వీరి పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఇక ఈ పెళ్లి వేడుకను ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మేనన్ పర్యవేక్షణలో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం. వీరి పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయడంతో ఈమె పెళ్ళికి సంబంధించిన ఎలాంటి వీడియోలు బయటకు రాలేదు.అయితే నయనతార దంపతులు వీరి పెళ్లికి హాజరైన పలువురు సెలబ్రిటీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెళ్లి వేడుకకు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను నెట్ ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసిందని అందుకుగాను నయనతార దంపతులు 25 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ నెట్ ఫ్లిక్స్ నయనతార విగ్నేష్ ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలను తమ అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇదిలా ఉండగా తాజాగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక టీజర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా నయనతార విగ్నేష్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ గురించి అలాగే వారి అభిప్రాయాల గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.