తమిళ రాజకీయాల్లో నయనతార కలకలం

Nayanthara

Nayanthara

డీఎంకే పార్టీకి నయనతార ఏమవుతుంది.? ఆ పార్టీ ముఖ్య నేత వారసుడికి ఆమెతో వున్న సంబంధమేంటి.? అంటూ సీనియర్ నటుడు రాధా రవి సంధించిన ప్రశ్నాస్త్రాలు సంధించారు. గతంలో రాధా రవి, డీఎంకే పార్టీలో పనిచేశారు. ఇప్పుడాయన భారతీయ జనతా పార్టీలో వున్నారు. నయనతార గురించి మాట్లాడినందుకే రాధారవిని డీఎంకే సస్పెండ్ చేసింది. ఆనాటి ఆ వ్యవహారాన్ని రాధా రవి, ఇప్పుడు తాజాగా తెరపైకి తెచ్చారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధితో నయనతారకు ఎఫైర్ వుందని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి. ఇద్దరికీ పెళ్ళి జరగబోతోందనీ పుకార్లు తెరపైకొచ్చాయి. నిజానికి, నయనతార మీద ఇలాంటి గాసిప్స్ కొత్తేమీ కాదు. శింబు, ప్రభుదేవాలతో నయనతార కొన్నాళ్ళపాటు సన్నిహితంగా వున్న మాట వాస్తవం. పెళ్ళి ఆలోచనలు కూడా ఆ ఇద్దరితో నడిచాయి.

కొంతకాలం శింబుతో, ఆ తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం నడిచింది. మరో తమిళ హీరో ఆర్య పేరుతోనూ నయనతారకి లింక్ పెట్టారు. ప్రస్తుతం ఆమె విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో వుంది. అయితే, అదంతా ఆమె వ్యక్తిగత వ్యవహారం. నయనతార అంటే తమిళనాడులో లేడీ సూపర్ స్టార్. ఆమెకు బోల్డంతమంది అభిమానులున్నారు. వాళ్ళందర్నీ హర్ట్ చేశాడిప్పుడు రాధా రవి. నిజానికి, రాధా రవికి వివాదాలు కొత్త కాదు. ఆయన పనే అది. గాయని చిన్మయి విషయంలోనూ రాధా రవి ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. రాధా రవికి వున్న పాపులారిటీ కారణంగా బీజేపీకి అలాగే బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేకి ఓ పదవి ఓట్లు అయినా వస్తాయో రావోగానీ, ఆయన చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యల దెబ్బకి, ఆ రెండు పార్టీలపైనా ప్రజల్లో వ్యతిరేకత పెరగడం ఖాయమనే చర్చ సర్వత్రా జరుగుతోంది.