జీవితంలో నువ్వు కోరుకున్నవి జరగాలి.. రవి కృష్ణ పై నవ్య స్వామి ఎమోషనల్ పోస్ట్!

ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న నవ్య స్వామి – రవి క్రిష్ణ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు ఆమె కథ అనే సీరియల్ లో కలిసి నటించారు. అప్పటి నుండి వీరిద్దరి మద్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక బుల్లితెర మీద జరిగే లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ఫేమస్ అయిన వారిలో సుధీర్, రష్మి జంట ఒకటి. వీరిద్దరు జబర్ధస్త్ ద్వార ఇలా ఫేమస్ అయ్యారు. తర్వత వర్ష- ఇమాన్యుల్ జంట కూడా బాగా ఫేమస్ అయ్యింది. వీరి బాటలో ఇప్పుడు నవ్య స్వామి- రవి క్రిష్ణ జంట కూడా వెళ్తోంది. బుల్లితెర మీద ప్రసారమైన ఆమె కథ సీరియల్ ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు.. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో సందడి చేస్తున్నారు.

ఢీ షో లో మేంటర్స్ గా వీరిద్దరు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి మద్య ఉన్న కెమిస్ట్రీ చూసి అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. ఇలా ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తూ అందరినీ నమ్మిస్తున్నారు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఇతర షోస్ లో కూడా వీరిద్దరు నానా రచ్చా చేస్తూ నిజంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా ? అని అనుమానం కలిగేలా ప్రేక్షకులను నమ్మిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ ఎంత యాక్టివ్ గా ఉంటారు ఒకరు చేసిన పోస్టులకి మరొకరు కామెంట్లు చేస్తూ ఉంటారు. నవ్య స్వామి సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల రవి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నవ్య స్వామి రవి కృష్ణ కు శుభాకాంక్షలు తెలియజేసింది. ” అత్యంత సన్నిహితుడైన నా ఫ్రెండ్ రవికృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎంతో సహనంతో, అంకితభావంతో పనిచేసే నీకు జీవితంలో నువ్వు కోరుకున్నవి లభించాలని ఆశిస్తున్నాను.
ఈ ఏడాదిపాటు నువ్వు కోరుకున్నవి జరుగుతూ.. సంతోషంగా ఉంటూ.. అంతా కూడా నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను” అని రవి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నవ్యస్వామి విషెస్ చెప్పింది. నవ్య స్వామి పోస్ట్ చూసి స్పందించిన రవి కృష్ణ థ్యాంక్యూ సో మచ్ మా అని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కారణంగా తరచూ ఇద్దరు వార్తల్లో నిలుస్తున్నారు.