శ్రీజ కూతురి పిక్ వైర‌ల్‌.. ఫ్యామిలీ ఫొటో అదిరింది అంటూ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి గారాల ప‌ట్టి శ్రీజ చాలా సుప‌రిచిత‌మే. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజ త‌ర‌చు త‌న ఫొటోస్‌తో పాటు ఫ్యామిలీ ఫొటోస్‌ని షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది. నిహారిక పెళ్ళి వేడుక‌లో శ్రీజ ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌న చెల్లెలితో క‌లిసి మెహందీ, సంగీత్, హ‌ల్దీ వేడుక‌ల‌లో సంద‌డి చేసింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోను త‌న ఫ్యామిలీతో క‌లిసి వెరైటీ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌కి మంచి థ్రిల్ క‌లిగించింది. అయితే నిహారిక పెళ్ళి వేడుక నుండి బిజీ బిజీగా ఉంది శ్రీజ‌.

నిహారిక పెళ్లికి సంబంధించి ప్ర‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శ్రీజ ఆ త‌ర్వాత నిహా బ‌ర్త్‌డే వేడుక‌లోను పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేసింది. ఇక రీసెంట్‌గా త‌న అన్న రామ్ చ‌ర‌ణ్ ఇచ్చిన క్రిస్మ‌స్ వేడుక‌లో త‌న భ‌ర్త‌తో క‌లిసి సంద‌డి చేసింది. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుక‌లో పాల్గొన‌గా, ఆ వేడుక‌కి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ఇక తాజాగా శ్రీజ కూడా త‌న ఇంట్లో జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల‌కి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేసింది. ఇందులో శ్రీజ కూతురు నవిష్క అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

న‌విష్క పుట్టిన‌ప్పుడు, ఆ మ‌ధ్యలో ఓ సారి నెటిజ‌న్స్ ముందుకు వ‌చ్చింది. ఇక ఇప్పుడు క్రిస్మ‌స్ ఈవ్‌లో క‌నిపించే స‌రికి అంద‌రి దృష్టంతా న‌విష్క‌పైనే ఉంది. న‌విష్క త‌న‌కు ఎంత ఇంపార్టెంటో త‌ల్లిగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేశారు. అంతే కాదు… ఇద్ద‌రు కూతుర్లు, భ‌ర్త‌తో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లాక్ డౌన్ స‌మ‌యంలో చిరు కూడా న‌విష్క గురించి కొన్ని విష‌యాలు చెప్పారు . మిమ్మీ మిమ్మిమ్మీ సాంగ్ పెట్ట‌మ‌ని త‌న ముద్దుల మ‌న‌వ‌రాలు ఎంత అల్ల‌రి చేస్తుందో చిరంజీవి వీడియో రూపంలో చూపించేశారు.