Nani: ఓరీ దేవుడో నాని అసలు పేరు ఇది కాదా… మరి అసలు పేరు….ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంతో తెలుసా!

Nani: సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ గాను హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఇక ఈయన ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఎంతోమందికి ఇండస్ట్రీలో అవకాశాలను కల్పిస్తూ నిర్మాతగా మారారు. ఇలా నాని నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు సినిమాలకు నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న నాని చివరిగా సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈయన హిట్ 3లో నటించడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాకి కూడా నాని నిర్మాతగా వ్యవహరించడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది ఈ క్రమంలోనే శ్రీకాంత్ దర్శకత్వంలో చిరు హీరోగా నాని సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాని కూడా అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా నానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు నాని పూర్తి పేరు అది కాదని తెలుస్తుంది. చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేర్లను మార్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా నాని కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నట్టు తెలుస్తుంది. మరి నాని అసలు పేరు ఏంటీ అనే విషయానికి వస్తే…

నాని అసలు పేరు నవీన్ బాబు గంట. ఈయన కాలేజీ చదువులు పూర్తి చేసుకునే వరకు ఇదే పేరుతోనే చలామణి అయ్యారు. అయితే ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పుడే ఈయన తన పేరును నానిగా మార్చుకున్నారు. ఇలా పేరు మార్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ మొదట నాలుగువేల రూపాయల జీతం అందుకున్నారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నాని అష్టా చమ్మ సినిమా ద్వారా హీరోగా అవకాశం అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ నటుడిగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.