పాపం : “పుష్ప” రిలీజ్ కోసం నేషనల్ లెవెల్లో.!

 
రీసెంట్ గానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” రిలీజ్ కి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో దీనికోసం చాలానే కష్టపడ్డాడు కానీ చివరి నిమిషంలో హిందీ డిస్ట్రిబ్యూటర్స్ తో కొన్ని కారణాల వల్ల సినిమా హిందీ రిలీజ్ ఆగిపోయింది అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. 
 
దీనితో బన్నీ అభిమానులు బాగా హర్ట్ అయ్యినట్టు ఉన్నారు. అందుకే ఈ సినిమా హిందీ రిలీజ్ కావాలి అంటూ ఏకంగా నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు. వారు అయితే సినిమా కోసం డిమాండ్ గట్టిగా చేస్తున్నారు కానీ చిత్ర యూనిట్ మళ్ళీ హిందీ రిలీజ్ వేరే నిర్మాణ సంస్థను లైన్ లో పెట్టారో లేదో తెలియాల్సి ఉంది. ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.