Bindhu, Nataraj: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని 11వ వారంలో అడుగుపెట్టింది. పదవ వారంలో ఆశు రెడ్డి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం ఇంట్లో 8 మంది కంటెస్టెంట్ లు కొనసాగుతున్నారు. వీరిలో టాప్ 5 కి చేరుకునేది ఎవరు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగింది. ప్రతి వారం ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పే బిగ్ బాస్ ఈ వారం మాత్రం ప్రతి కంటెస్టెంట్ ముగ్గురిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.
11వ వారంలో నామినేషన్ ప్రక్రియ సమయంలో బిందు మాధవి నట రాజ్ మాస్టర్ ని నామినేట్ చేసి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఫినాలే వరకు కొనసాగే అర్హత లేదని చెప్పింది. ఈ కారణం చేత ఇద్దరి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. బిందు తనని నామినేట్ చేయడంతో అసహనానికి గురైన నట రాజ్ మాస్టర్ ఆమె మీద మాటలతో విరుచుకుపడ్డారు. తెలుగు అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా నీలో లేవు .మీ నాన్న నిన్ను పెంచటంలో ఫెయిల్ అయ్యాడు అంటూ అదుపు లేకుండా మాటలు మాట్లాడాడు. అంతేకాకుండా డబ్బులు ఇచ్చి బయట ఓట్లు వేయించుకొని ఫినాలే వరకు వస్తున్నావు అని మాట్లాడారు.
దీంతో బిందుమాధవి కూడా ఏ మాత్రం తగ్గకుండా మాస్టర్ మాట్లాడే ప్రతి మాట కు కౌంటర్ వేస్తూ వచ్చింది. నటరాజ్ మాస్టర్ ఇలా ప్రవర్తించడానికి బిందు నామినేట్ చేయడం కారణం అని అందరూ భావిస్తున్నారు. కానీ ఇటీవల ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బయట ఉన్న పరిస్థితుల గురించి హౌస్ మేట్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. దేవి నాగవల్లి ఏకంగా బిందుని ఫస్ట్ ప్లేస్ లో పెట్టి హౌజ్ మేట్స్ కి హింట్ ఇచ్చింది. అందువల్ల బిందు అసలు హౌస్ లో గేమ్ ఆడకుండా విన్నర్ ఎలా అవుతుంది అని నట రాజ్ మాస్టర్ ఆమెని టార్గెట్ చేశాడు. అయినా బిందుమాధవి పట్ల నట రాజ్ మాస్టర్ ప్రవర్తించిన తీరు సరిగాలేదని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.