Modi: ఏంటి పవన్ హిమాలయాలకు వెళ్ళిపోతావ…. పవన్ పై జోకులు వేసిన ప్రధాని!

Modi: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో బిజెపి పార్టీకి కూడా కీలకంగా మారారు. ఇక బిజెపి ఇటీవల పోటీ చేసిన ఎన్నికలలో కూడా ఈయన ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేస్తూ బిజెపి గెలుపుకు ఎంతగానో కృషి చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా మరోసారి బిజెపి అధికారాన్ని అందుకుంది నేడు బిజెపి పార్టీ నుంచి రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కాషాయపు రంగు దుస్తులలో కనిపించారు. ఇలా వేదికపై ఉన్న వారందరినీ కూడా మోడీ పలకరిస్తూ వచ్చారు. అయితే పవన్ వద్దకు రాగానే మోడీ తనపై జోకులు వేశారని అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వేదికపై మోడీ తనతో ఏం మాట్లాడారు అనే విషయాన్ని మీడియా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ.. ప్రధాని మోదీ గారు నాతో చిన్న జోక్ చేశారని తెలిపారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నావా అంటూ అడిగారు. అందుకు ఇంకా చాలా టైం ఉందని ముందు నువ్వు చేయాల్సిన పనులని చేయి అంటూ మోడీ నాతో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.