OG: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలలో బిజీబిజీగా ఉండడంతో ఈ సినిమా నిలిపివేశారు. ఇకపోతే ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించడంతో పాటు, అప్డేట్ లు కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమాలో టాలీవుడ్ నటుడు నారా రోహిత్ భార్య శిరీష నటించబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో శిరీష కీలకపాత్రలో నటించబోతోందట. కాగా ఇందులో ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఒక లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ ముంబైలో జరుగుతోందట. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే నారా రోహిత్, శిరీషల విషయానికి వస్తే.. ప్రతినిధి 2 సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో గత ఏడాది వీరిద్దరీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట ఏడడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నారా రోహిత్ కూడా ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. భైరవం సినిమాలో నారా రోహిత్ నటించిన విషయం తెలిసిందే. అలా ఇద్దరూ ఈ ఏడాది వారి సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.