Nara Lokesh view : బిగ్ న్యూస్ : “RRR” సినిమాపై నారా లోకేష్ వ్యూ.. ఏమేం అన్నాడంటే..?

Nara Lokesh view : ఎన్నో ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). భారీ అంచనాల నడుమ ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా మన ఇండియాలో అయితే అన్ని భాషల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ హిట్ టాక్ తెచ్చుకొని అదరగొట్టింది.
మరి మొదటి రోజు వసూళ్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక్కొక్కరి నుంచి టాక్ మాత్రం సెన్సేషనల్ గా వస్తుంది. ఆల్రెడీ అనేక మంది సినీ క్రిటిక్స్ తమ స్పందనని తెలియజేస్తుండగా ఇప్పుడు నందమూరి వారి అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తుంది.
కేవలం వారికే కాకుండా నారా వారి అభిమానులు టీడీపీ అభిమానులకి కిక్ ఇస్తుంది.
అంత పని చేసాడు. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఈ RRR సినిమాపై తన స్పందన చెప్పడం విశేషంగా మారింది. దీనిపై మాట్లాడుతూ ఈ ట్రిపుల్ ఆర్ చిత్రానికి అదిరే రివ్యూస్ వస్తున్నాయని వినడం చాలా ఆసక్తిగా ఉందని..
హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు దర్శకుడు రాజమౌళి లకి ప్రత్యేక కంగ్రాట్స్ వ్యక్తం చేస్తున్నాని, అలాగే ఈ సినిమాని నా కుటుంబంతో ఈ వారాల్లో ఖచ్చితంగా వీక్షిస్తానని తెలిపారు. అలాగే ఈ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చెయ్యాలని కోరుకుంటున్నట్టు లోకేష్ ట్వీట్ చేశారు.
దీనితో ఈ భారీ సినిమాపై నారా లోకేష్ వ్యూ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
https://twitter.com/naralokesh/status/1507202066061864963?s=20&t=Q-_KR3j58HXV42SUJXDt3Q