Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు ఇక బాలయ్య పుట్టినరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున బాలయ్య పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఘనంగా కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నాయి. ఇక బాలయ్య పుట్టినరోజు కావడంతో తన అల్లుడు ఆంధ్ర ప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన మామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య అంటూ లోకేష్ చాలా వెరైటీగా తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిను లోకేష్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తన మామయ్య బాలకృష్ణ అంటే లోకేష్ కి కూడా ఎంతో అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు.
ఇక బాలకృష్ణ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో వైసిపి తుఫానులో కూడా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో గెలవడం విశేషం. ఇలా సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు రాజకీయాలలో కూడా ఈయన అన్ స్టాపబుల్ అంటూ లోకేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.