Nara Lokesh : నారా లోకేష్ మూర్ఖత్వం: ఇలాంటి బిరుదు ఇచ్చేసుకున్నాడేంటీ.!

Nara Lokesh :  ఏంటో ఈ పైత్యం.! కొత్త తరం రాజకీయాలు తాము ఏం చేస్తున్నారో ఆలోచించుకోవడం లేదు.. ఏం మాట్లాడుతున్నారో అసలే వాళ్ళకి అర్థం కావడంలేదు. తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావుని దేవుడిగా అభివర్ణించాడు నారా లోకేష్.
అక్కడితో ఆగితే వింతేముంది.? తన తండ్రి నారా చంద్రబాబునాయుడిని రాముడిగా అభివర్ణించుకున్నాడు. తండ్రి కదా.. ఆ మాత్రం పొగడటంలో వింతేమీ లేదు.
కానీ, తనను తాను మూర్ఖుడిగా పేర్కొన్నారు నారా లోకేష్. పైగా తన మీద 11 కేసులున్నాయనీ, అందులో హత్యాయత్నం కేసు కూడా వుందని గొప్పగా చెప్పుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అంతేనా, ఎవరి మీదన్నా 12 కేసులు వుంటేనే, టీడీపీకి బాగా సేవ చేసినట్లని లోకేష్ చెప్పుకొచ్చారు.
అంటే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి కనీస అర్హత 12 క్రిమినల్ కేసులన్నమాట. రాజకీయాల్లో విలువలెప్పుడో మాయమైపోయాయ్. వాటికి పాతరేసేసి చాలాకాలమైపోయింది.
జైలుకెళ్ళొచ్చినోళ్ళు ముఖ్యమంత్రులవుతున్నప్పుడు, ఎమ్మెల్యేల మీద కనీసం 12 కేసులు వుండాలన్న రూల్‌లో వింతేమీ లేదేమో.!
వ్యవస్థల్ని ఇంకెంత స్థాయికి దిగజార్చేయాలని నారా లోకేష్ ఉవ్విళ్ళూరుతున్నారోగానీ, తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించేసుకుంటూ మూర్ఖత్వంతో కూడిన వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతా చేసి, 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందా.? అంటే, అది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజల మెప్పు పొందడానికి, ప్రజల్లోకి వెళ్ళాలి. వివాదాల జోలికి వెళ్ళకుండా ప్రజా సమస్యలపై పోరాడాలి. అలా చేస్తే కదా.. ప్రజలు ఓట్లేసి గెలిపించేది.? అంతే తప్ప, గొడవ పడండి.. కేసులు పెట్టించుకోండంటూ పార్టీ నేతలకు నారా లోకేష్ పిలుపునివ్వడమేంటో.!