Nara ‘Jokesh’ Vs Ys Jagan : నారా ‘జోకేష్’ వర్సెస్ వైఎస్ జగన్ ‘మోసపు’ రెడ్డి.!

Nara ‘Jokesh’ Vs Ys Jagan : రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సర్వసాధారణం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవి ఎప్పటికప్పుడు శృతిమించుతున్నాయి.. అత్యంత పతన స్థాయికి దిగజారిపోయాయి. ఇందులోనూ మళ్ళీ క్రియేటివిటీ అత్యంత విచ్చలవిడిగా పెరిగిపోతుండడం గమనార్హం.

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారా లోకేష్ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి, జగన్ ‘మోసపు’ రెడ్డిగా అభివర్ణించారు. బడ్జెట్ పేరుతో అంకెల గారడీ చేశారనీ, ప్రజల్ని వంచించిన ప్రభుత్వం, ఇంకా అబద్ధాలు మాట్లాడుతూనే వుందనీ, బడ్జెట్ నిండా అబద్ధాలే వున్నాయనీ ఆరోపించేశారు నారా లోకేష్.

సరే, ఏ పార్టీ అధికారంలో వున్నా చేసేది పబ్లిసిటీ స్టంట్లే.. చూపించేది అంకెల గారడీనే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఏళ్ళ తరబడి వేల కోట్లు కాదు.. లక్షల కోట్లు జనోద్ధరణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నా, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల కన్పించడంలేదంటే దానర్థం అన్ని ప్రభుత్వాలూ వైఫల్యం చెందాయనే కదా.?

‘తాను చేస్తేనే శృంగారం.. ఇంకెవరన్నా చేస్తే వ్యభిచారం’ అన్నాడట వెనకటికి ఒకడు. అలా వుంది టీడీపీ నేతల ఆరోపణల వ్యవహారం.!
ఇక, వైసీపీ ఎదురుదాడి విషయానికొస్తే, నారా లోకేష్‌ని కాస్తా, ‘జోకేష్’, ‘పప్పేష్’ అంటూ విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. సరిపోయింది సంబడం.!