సమంత వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నందిని రెడ్డి.. ఆసక్తి లేదంటూ కామెంట్స్!

అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు లేడీ డైరెక్టర్ గా నందినిరెడ్డి పరిచయమయ్యారు.ఈ సినిమాతో డైరెక్టర్ గా మారిన ఈమె అంతకు ముందు ఎంతో మంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు. నందిని రెడ్డి దర్శకత్వంలో చివరగా వచ్చిన చిత్రం ఓ బేబీ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత నందినిరెడ్డి ఎలాంటి సినిమాలకు వర్క్ చేయలేదు. ప్రస్తుతం తన సినిమాలు చర్చల దశలో ఉన్నాయని వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాజాగా నందినిరెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సమంత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలోకి సమంత తన ఇద్దరు ఒకేసారి ఎంట్రీ అయ్యామని నందినీ రెడ్డి వెల్లడించారు.ఇకపోతే జబర్దస్త్ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంత ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడ్డారని ఆ సమయంలో తనకు తోడుగా ఉండటం వల్ల సమంతతో మంచి స్నేహబంధం ఏర్పడిందని నందినిరెడ్డి తెలియజేశారు.

ఇలా అప్పటినుంచి సమంతతో తనకి మంచి స్నేహం ఏర్పడిందని అయితే ఎంతో స్నేహంగా ఉన్నా, మా స్నేహానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయని, వాటిని దాటి ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి చూపని, అలాంటి ఆలోచన కూడా తనకు రాదని నందినీరెడ్డి వెల్లడించారు. సెలబ్రిటీలు అన్న తర్వాత వారి గురించి మనకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది లేదంటే వారి గురించి మనల్ని తరచూ ప్రశ్నిస్తుంటారు. ఇక సమంత నాగ చైతన్య విషయానికి వస్తే వారిద్దరి మధ్య ఏం జరిగిందో వారికి మాత్రమే తెలుసని అయితే ఆ విషయం తెలియక ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు అయితే నిజమేంటో వాళ్లకు మాత్రమే తెలుసని నందినీ రెడ్డి వెల్లడించారు.