Nandamuri Padmaja: నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్ పెద్దమ్మ మృతి!

Nandamuri Padmaja: ఇటీవల సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న కోటా శ్రీనివాసరావు గారి సతీమణి మరణ వార్త గురించి తెలిసి అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా నందమూరి కుటుంబంలో కూడా తీవ్రమైన విషాదం నెలకొందని తెలుస్తుంది. నందమూరి తారక రామారావు పెద్ద కోడలు పద్మజ మరణించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో మరణించారని తెలుస్తోంది.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల బారిన పడ్డ పద్మజ మంగళవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇలా ఆమె పరిస్థితి క్షీణించిన తరుణంలోనే కన్నుమూశారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుండి దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు మధాహ్ననికి హైద్రాబాద్ కి చేరుకోనున్నారు. పద్మజ మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇకపోతే నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగిన నందమూరి కృష్ణ చైతన్య జై కృష్ణ పద్మజ కుమారుడు కావటం విశేషం. కృష్ణ చైతన్య తల్లి మరణించడంతో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హుటాహుటిన జయ కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు పద్మజ స్వయాన పెద్దమ్మ వరుస అవుతారు. ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో ఎక్కడ ఈ సంఘటన గురించి స్పందించలేదు. పద్మజ మరణ వార్త తెలిసిన నందమూరి అభిమానులు కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలి అంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.