నందమూరి బాలకృష్ణ వారసుడు వచ్చేస్తున్నాడు

కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో వారసుల హంగామా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, నాగేశ్వర రావు వారసులుగా బాలకృష్ణ, నాగార్జున, రామానాయుడు వారసుడిగా వెంకటేష్ స్టార్స్ గా ఎదిగారు. ఆ తర్వాత జనరేషన్ లో నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ఆల్రెడీ తెలుగు లో డెబ్యూ చేసారు. మరో పక్క వెంకటేష్ అన్న కొడుకు రానా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అయితే చాన్నాళ్ల నుండి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై చాలా వార్తలు వచ్చాయి. మొదట్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో చిన్న రోల్ లో మెప్పిస్తాడు అనుకున్నారు, కానీ జరగలేదు. తర్వాత సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వలో ‘ఆదిత్య 999 ‘ సినిమాతో ఎంట్రీ ఇస్తాడు అన్నారు కానీ అది కూడా అవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. నాని `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ బాల‌య్య త‌న‌యుడి డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమాకి `ప్రేమించి చూడు` అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వారాహి చలన చిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్రపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. అయితే దీని పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.