నాగార్జున, సమంత మామ కోడళ్లలా కాకుండా తండ్రీ కూతుళ్ళలా ఉంటారు. నాగార్జున సమంతకు అన్ని విషయాల్లోనూ మద్దతిస్తూ ఉంటారు. ఆమె నటన, సినిమాల సెలక్షన్, ఐడియాలజీ అంటే నాగార్జునకు చాలా ఇష్టం. అందుకే ఎక్కడైనా సరే ఆమెకు మద్దతు ఇస్తూ ఉంటారు. సమంత ఇటీవల ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సిరీస్ మీద తమిళనాడులో వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ వెబ్ సిరీస్లో సమంత ఇక రెబల్ పాత్రలో నటించింది. ట్రైలర్ కట్ చూస్తే ఆమె పాత్ర తమిళనాడుకు చెందిన ఉగ్రవాదిలా ఉంటుంది. ఇదే వివాదానికి కారణమైంది.
తమిళ రెబల్స్ విషయంలో తమిళ ప్రజలకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. తమిళుల తరపున పోరాడిన రెబల్స్ ను ఎవరైనా తక్కువ చేసినా, తప్పుగా చూపించినా అస్సలు ఒప్పుకోరు. ఈ విషయంలో విజయ్ సేతుపతినే విలవిలలాడేలా చేశారు. ఇప్పుడు అదే సమంత విషయంలో జరుగుతోంది. తమిళనాడుకు చెందిన సమంత తమిళ రెబల్స్ ను కించపరిచే వెబ్ సిరీస్ ఎలా చేసింది అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు రాజకీయ నాయకులు కొందరు వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలని కేంద్రానికి ఫిర్యాదులు పంపారు.
వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే స్పందిస్తూ ఇందులో తమిళులను కించపరిచే కంటెంట్ ఏదీ ఉండబోదని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే వెబ్ సిరీస్ చేశామని అంటున్నా వ్యతిరేకులు వినట్లేదు. విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే నాగార్జునకు నచ్చట్లేదట. తన కోడలిని అనవసరంగా టార్గెట్ ఆయన తట్టుకోలేకున్నారట.