అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ పక్కనే అగ్ని ప్రమాదం.. నాగార్జున ట్వీట్

nagarjuna tweet on annapurna studios fire accident

ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో, ప్రముఖ మీడియా వెబ్ సైట్లలో, టీవీ చానెళ్లలో అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం జరిగిందని.. మంటలు ఎగసి పడ్డాయని.. పక్కనే బిగ్ బాస్ హౌస్ ఉందని తెగ వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ వార్త నిజమా? అబద్ధమా? అనేది మాత్రం తెలియలేదు.

nagarjuna tweet on annapurna studios fire accident
nagarjuna tweet on annapurna studios fire accident

ఉదయం పూట ఓ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని కొన్ని మీడియా సంస్థలు రాశాయి. మంటలు ఎగసి పడటంతో చుట్టూ దట్టమైన పొగ అలుముకుందని… దీని వల్ల పక్కనే ఉన్న బిగ్ బాస్ హౌస్ కు కూడా ప్రమాదం పొంచి ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ ఘటనపై టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున స్పందించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి ట్వీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగిందని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. ఏం బాధ పడాల్సిన అవసరం లేదు. అవి తప్పుడు వార్తలు. స్టూడియోలో అంతా సాధారణంగా ఉంది. సురక్షితంగా ఉంది.. అని నాగ్ ట్వీట్ చేశారు.

అగ్ని ప్రమాదం అవాస్తవం అయితే.. మరి అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని వార్తలు ఎవరు రాశారు? ఎందుకు రాశారు? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మిగిలింది.