Sammeta Ghandhi: రాజన్న సినిమాలో నాగార్జున గారితో కేవలం ఒక సీన్ మాత్రమే చేసే అవకాశం వచ్చిందని నటుడు సమ్మెట గాంధీ అన్నారు. తాను ఆయనతో కలిసి నటించేటపుడు నాగార్జున గారికీ, తనకు మధ్య సంఘటనకు గాంధీ ఓ ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.
నాగార్జున గారు రాజన్న సెట్‌లో ఉన్నపుడు తనను పిలిచి, మీరు స్టేజ్ ఆర్టిస్టా అని అడిగారని సమ్మెట గాంధీ చెప్పుకొచ్చారు. అయితే అక్కడే ఉన్న హీరోయిన్ స్నేహతో అతను స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ డైలాగ్ ఎలా చెప్పాడో, వినడానికి ఎంత బాగుందో అని ఆమెతో చెప్పినట్టు ఆయన తెలిపారు. దానికి తాను థ్యాంక్స్ సర్ అని చెప్పినట్టు ఆయన వివరించారు. అది కూడా ఒక రకమైన అప్రిసియేషనే కదా అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత తాను సీరియల్‌లో నంది అవార్డు వచ్చినపుడు నాగార్జున గారు పిలిపించి, మీటింగ్ పెట్టి మా సంస్థలో పర్మినెంట్ ఆర్టిస్ట్ అయిపోయారు మీరు అని అన్నట్టు ఆయన చెప్పారు.
ఇకపోతే ఆ సినిమాలో చేసిన చిన్నపాప చాలా మంచి ఆర్టిస్ట్ అని, ఆమెకు తాను భయపడేవాడినని ఆయన నవ్వుతూ చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా నటించేది.. కాబట్టి తాను కూడా బాగా నటించి దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా అని ఆయన వివరించారు. తామిద్దర్నీ చూసిన వాళ్లంతా నిజంగా తాతా, మనవరాలు అనుకునేవాళ్లని ఆయన చెప్పారు. అంత బాగా కలిసిపోయేదని ఆయన అన్నారు. ఆ సినిమా తర్వాత తన సొంత ఊరు పెడనలో ఊరేగింపు చేసి, తనకు సన్మానం కూడా చేశారని సమ్మెట గాంధీ ఆనందం వ్యక్తం చేశారు.