అక్కినేని నాగార్జున ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి విని ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అంటే నా కోసం దర్శకులు విభిన్న కథలని సిద్ధం చేయడమే అని అన్నారు. మంచి మంచి పాత్రలు సిద్ధం చేసి నాకు మంచి విజయాలను అందించారు. వారి వల్లనే నేను ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నానని నాగార్జున తెలియజేశారు.
కొన్ని ఏళ్ళ నుండి నాగార్జున- టబు మధ్య రిలేషన్ షిప్ ఉందని చాలా రూమర్లొచ్చాయి. అలాగే వీరిద్దరూ రిలేషిప్ లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. దీనిపై కూడా నాగార్జున దానిపై క్లారిటీ ఇచ్చారు. “టబూ నాకు అద్భుమైన స్నేహితురాలు. మా స్నేహం నాకు 21 – 22 ఏళ్లు, టబూకి 16 ఏళ్ల వయసు నుంచే కొనసాగుతోంది. అంటే జీవితంలో సగం కాలం. మా స్నేహం గురించి చెప్పింది చాలా తక్కువ. నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరును పలికారంటే నా మొహం వెలిగిపోతుంది. దాన్ని మీరు ఏదో అనుకుంటే అది మీరు చూసే దృక్పథం నుంచే ఉంటుంది. టబూ అమలకు కూడా మంచి స్నేహితురాలు అని నాగార్జున అన్నారు.