Coolie: కూలి సినిమాలో నన్ను నేను చూసి ఆశ్చర్యపోయాను.. నేనేనా అనిపించింది: నాగార్జున

Coolie: టాలీవుడ్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు నాగార్జున. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన కూలీ అలాగే కుబేర సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కుబేర సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు కూలి సినిమా షూటింగ్ జరుగుతోంది.

కూలి సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కుబేర సినిమా విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన, ధనుష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మూవీ మేకర్స్ బిజీబిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో కార్యక్రమాలలో భాగంగానే తాజాగా హీరో నాగార్జున ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కుబేర సినిమాలో తన పాత్ర గురించి అలాగే కూలి సినిమాలో తన పాత్ర గురించి తెలిపారు.

కుబేర మూవీలో నేను పోషిస్తోన్న పాత్రకు కూలీ సినిమాలో నా పాత్రకు ఎలాంటి సంబంధం లేదు. లుక్స్‌, బాడీ లాంగ్వేజ్‌, భాష, స్టైల్‌ ఇలా ప్రతీ విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుందని అని తెలిపారు నాగార్జున. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. లోకేశ్‌ కనగరాజ్‌ ఒక విజిల్‌ ఫ్యాక్టర్‌. చెన్నైలో ఆయనకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూశానువ్వు. ఆ సినిమాలో నా పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది. నన్ను స్క్రీన్‌ పై చూపించిన విధానానికి లోకేశ్‌ కు ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్‌ టైమ్‌ విజువల్‌ చూసినప్పుడు ఇది నేనేనా? అనిపించింది. ఆశ్చర్యం వేసింది. ఇది పూర్తిస్థాయి విజిల్‌ మూవీ. లోకేశ్‌ సినిమాల్లో పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నాకు విక్రమ్‌ మూవీ అంటే ఎంతో ఇష్టం. అందులో ఫహద్‌ ఫాజిల్‌, విజయ్ సేతుపతి ఇలా ఎవరి పాత్ర చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ ప్రతిఒక్కరి పాత్ర గుర్తుండిపోతుంది. అదే ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అని చెప్పాలి అని నాగార్జున చెప్పుకొచ్చారు.