Nagarjuna: ఆ విషయంలో బిగ్ బాస్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్న నాగార్జున..!

Nagarjuna: మన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఒకవైపు సినిమాలతో మరొకవైపు టీవి షోస్ తో చాల బిజీగా ఉన్నాడు. నాగార్జున నటుడిగా మాత్రమే కాకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి షో లకు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వార చాలామంది తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇలా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయటంలో నాగర్జున ఎప్పుడూ ముందుంటారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 5 లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న లహరి హౌసెలో ఉన్నంత కాలం తన అందంతో పాటు మంచి ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంది. కొంత కాలం క్రితం ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న లహరి యాంకర్ గా మంచి పేరు తెచ్చుకోవాలనేదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరించింది. ఆ సమయంలో లహరి యాంకరింగ్ కి ఇంప్రెస్ అయిన నాగార్జున ఆమెకు మంచి ఆఫర్ ఇచ్చాడు.

లహరి కోసం నాగర్జున అన్నపూర్ణ స్టూడియోలో
ఒక ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆ ప్రాజెక్ట్ చర్చల కోసం లహరి తరచు నాగార్జునని కలిసింది అని సినీ వర్గాల సమాచారం. అయితే నాగార్జున లహరిని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగ విడుదలైన బంగార్రాజు సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న నాగర్జున దాని తర్వాత ది ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.