Nagarjuna: టాలీవుడ్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. నాగార్జున ప్రస్తుతం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ వంటి షోలు చేస్తూ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇకపోతే నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నాగార్జున పెళ్లి పనుల్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. త్వరలోనే అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని నాగార్జున కొడుకు హీరో అక్కినేని అఖిల్ వివాహం త్వరలోనే జరుగునుంది. ఈ సందర్భంగా రాజకీయ నాయకులను సినీ సెలబ్రెటీలను కలిసి శుభలేఖలు అందిస్తున్నారు నాగార్జున. అందులో భాగంగానే ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించి వివాహ పత్రికను అందజేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అఖిల్ గత ఏడాది నవంబర్ లో జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు జూన్ 6న పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టేడియోలోనే సింపుల్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగిన విషయం తెలిసిందే. అలా అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.