Nagarjuna: అక్కినేని నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు చిత్రం ద్వారా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇలా 2016 సంవత్సరంలో విడుదలైన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ చిత్రంగా 2022 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా బంగార్రాజు చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య నాగార్జున గురించి అన్ని విషయాలు బయట పెట్టారు.
ఈ క్రమంలోని ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జునకు కోపం తెప్పించే సన్నివేశాలు ఏంటి అని ప్రశ్నించగా… అందుకు నాగ చైతన్య సమాధానం చెబుతూ… నాన్న ఏదైనా ఒక ప్లాన్ చెప్పినప్పుడు చివరి నిమిషంలో ఆ ప్లాన్ మారిస్తే ఎంతో కోప్పడతారని అలాంటి సమయంలో నాన్నకు ఎంతో కోపం వస్తుందని తెలిపారు. మరి ఆ కోపం తగ్గాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య ఎంతో ఆసక్తి కరమైన సమాధానాన్ని తెలియజేశారు.
నాన్న బాగా కోపంగా ఉన్నప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన బిర్యాని తెచ్చి పెడితే చాలు అతని కోపం మొత్తం వెళ్ళిపోతుందని తెలిపారు.నాన్నకు ఇండియన్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక మహిళ చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారని తెలిపారు. బిర్యాని గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన ఆ మహిళ చేసే బిర్యాని గురించి మాట్లాడుతారని తెలపడంతో ప్రతి ఒక్కరూ ఆ మహిళ ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు. మొత్తానికి నాగచైతన్య ఇంటర్వ్యూ ద్వారా నాగార్జున విషయాలను బయటపెట్టారు.