Kubera: కుబేర సినిమా అప్డేట్.. డబ్బింగ్ పనులు పూర్తిచేసిన నాగార్జున!

Kubera: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు మూవీ మేకర్స్. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే హీరో ధనుష్ డబ్బింగ్ పనులు పూర్తి చేయగా, రష్మిక మందన కూడా డబ్బింగ్ చెప్పేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున సైతం సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేశారట. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రమోషన్ వీడియోలలో నాగార్జున లుక్ బాగా ఆకట్టుకుంది. తాజాగా కొడుకు పెళ్లిని చేసేసిన నాగార్జున ఈ తంతు మొత్తం అయిపోగానే వెంటనే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.

కాగా సినిమాలో నాగ్ బాగా డబ్బున్న వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ విషయంపై ఇంకా సరైన స్పష్టత లేదు. ఇకపోతే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో పడ్డారు. విడుదల తేదీకి మరొక 13 రోజులు మాత్రమే సమయము ఉంది. ఈలోపే ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెడుతూనే సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేయాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.